బెల్లంపల్లి, ఏప్రిల్ 20, (జనంసాక్షి )తమ డిమాండ్ల సాధన కోసం వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బెల్లంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. గురువారం కాంగ్రెస్ నాయకుడు న్యాతరి స్వామి వీవోఏల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో బతుకు బండిని లాగిస్తున్నారని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బాధాకరం అన్నారు. వీవోఏల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, డిమాండ్లు నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను సాదించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వీవోఏల యూనియన్ నియోజకవర్గ కోశాధికారి దుర్గం మల్లేష్, చుంచుల మల్లేశ్వరి, పోషమల్లు, భాగ్య తదితరులు పాల్గొన్నారు.




