జహీరాబాద్ ఏప్రిల్( జనం సాక్షి). మొగుడం పల్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని ఖంజమాల్ పూర్, మడ్గి గ్రామాల్లో 5 లక్షల చొప్పున జడ్పి నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటి హాల్ నిర్మాణం కోసం ఉత్తర్వులను మండల జడ్పిటిసి అరుణ మోహన్ రెడ్డి సంబంధిత బాద్యులకు అందించారు, ఈ సందర్భంగా మండల జడ్పిటిసి అరుణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ మండల పరిధిలో అన్ని కులాలు, మతాల వారికి సమదృష్టితో చూస్తూ అభివృద్దీని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తామని, దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే ఖంజమాల్ పూర్ గ్రామంలో 5 లక్షల నిధులతో ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మాణం, మడ్గి గ్రామంలో 5 లక్షల నిధులతో చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం మండల్ లోని మాడిగి గ్రామానికి చర్చ్ కాంపౌండ్ వాల్ కోసం జడ్పిటిసి నిధులతో పనులు చెప్పట్టడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మండల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకొంటామని, గతంలో కూడా మండల అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి చొరవతో కోట్ల రూపాయల నిధులు మంజూరు చెయ్యడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేస్తామని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని దళితుల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తామని, మండల కేంద్రంతో పాటు మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని మొగుడం పల్లి మండల జడ్పిటిసి పట్లోళ్ల అరుణ మోహన్ రెడ్డి అన్నారు.. కార్యక్రమంలో మడ్గి గ్రామ ఎంపిటిసి షకీల్, ఇప్పేపల్లి ఎంపిటిసి తుకారాం, ఖంజమాల్ పూర్ సర్పంచ్ ప్రసాద్, మచ్చేందర్, తదితులు పాల్గొన్నారు..




