Monday, 2 November 2026

కొనసాగుతున్న వీవోఏల రిలే నిరాహార దీక్షలు.

 

 

 

 

బెల్లంపల్లి, మే 1, (జనంసాక్షి )తమ డిమాండ్ల సాధన కోసం వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 15వ రోజుకు చేరుకున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఐకేపీ వీవోఏలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. నెన్నెలలో వీవోఏల దీక్ష శిబిరంలో ఐకేపీ వీవోఏలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వీవోఏల యూనియన్ మండల అధ్యక్షుడు తైదల సమ్మయ్య మాట్లాడుతూ ఏళ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో బతుకు బండిని లాగిస్తున్నామని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బాధాకరం అన్నారు. వీవోఏల ఉద్యమానికి అన్ని పార్టీలు అండగా నిలవాలని అన్నారు. డిమాండ్లు నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను సాదించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు కౌటారపు భీమన్న, పోషమల్లు, అనిల్, ఉషన్న, పురుషోత్తం, రవి, చుంచుల మల్లేశ్వరి, ఇందారపు భాగ్య, వీవోఏలు పాల్గొన్నారు.