కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగాలి
జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలలో సజావుగా సాగాలని మార్కెట్ కమిటీ చైర్మన్ వర్తినేని నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. మంగళవారం కథలాపూర్ మండల కేంద్రంలోని ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు, అనంతరం మాట్లాడుతూ వడ్ల కొనుగోలు పై ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రత్యేక దృష్టి సారించారని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు పూర్తి చేయాలని తెలిపినట్లు తెలిపారు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే రమేష్ బాబుకు తెలిపి తొందర్లోనే పనులు పూర్తి చేశానని, కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి దాపరికం లేకుండా ఉండడమే బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో ఏపీఎం నరహరి తీసి విజయనిర్మల తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు జీవన్ రెడ్డి మామిడిపల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు
కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగాలి




