Thursday, 5 November 2026

కళా ఉత్సవం -2022 జిల్లాస్థాయి  పోటీలు ప్రారంభం

కళా ఉత్సవం -2022 జిల్లాస్థాయి  పోటీలు ప్రారంభం

 

వరంగల్ ఈస్ట్, నవంబర్ 22(జనం సాక్షి)

 

కళా ఉత్సవం 2022 జిల్లా స్థాయి పోటీలు వరంగల్ నగరంలోని ఓయాసిస్ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి

మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో మొదటిరోజు శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, శాస్త్రీయ గాత్రం జానపద గాత్రం విభాగాలలో

పోటీలు జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి  డి వాసంతి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు కార్యక్రమం లో మాట్లాడుతూ  విద్యలోనే కాకుండా కళలలో కూడా విద్యార్థులు రాణించాలని కోరారు. జిల్లా స్థాయి లోని వివిధ ప్రాంతాల నుంచి  వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభ  ప్రదర్శిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సారయ్య. ఒయాసిస్ పాఠశాల అధినేత

పరంజ్యోతి. ఉపాధ్యాయులు ఆడేపు రవీందర్. శ్రీధర్ ఆచారి. నివేదిత.. శార్వాణి,శివకుమార్ మరియు మండల రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు