Thursday, 5 November 2026

కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర:ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి

 

 

 

 

 

 

తిరుమలగిరి(సాగర్), ఏప్రిల్ 16 (జనంసాక్షి ): కొనుగోలు కేంద్రాల లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి అన్నారు .ఆదివారం మండలంలోని రాజవరం గ్రామంలో కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం (పాక్స్)అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై  ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల కు  ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.అధికారులు ప్రభుత్వం గ్రేడ్ ప్రకారంగా ధరను నిర్ణయిస్తారు.అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి   సొసైటీ చైర్మన్ రిక్కల మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, అల్లి పెద్దిరాజు  ,డైరెక్టర్లు ఎలకాని సత్యం, పిఎసిఎస్ డైరెక్టర్ సపావత్ బాలు నాయక్,కుందూరు శ్రీనివాస్ రెడ్డి, నాగయ్య, బివి రమణ రాజు, సర్పంచులు పోలేపల్లి సైదమ్మఆంజనేయులు,  కైకబిచ్చ నాయక్,సభావత్ జ్యోతి శంకర్ నాయక్,ఉప సర్పంచ్ కిషోర్,మాజీ ఎంపీటీసీ పెద్ద మైసయ్య,పుల్లం రాజు,చిన్న మల్లయ్య,చింతకాయల నరసింహ, సౌడబోయిన శ్రీను,గురి లింగం, చెరువు చైర్మన్ నగేష్,యం సి కే ఆర్ సభ్యులు బొడ్డుపల్లి రవీంద్ర చారి,గడ్డమీది నాగార్జున,ఇసుక మల్లి, వ్యవసాయ అధికారి జానకి, సీఈవో సత్యం, శ్రీను,నాయకులు,రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.