Tuesday, 3 November 2026

కోఠీలో డివైడర్‌‌ను ఢీ కొన్న కారు.. ముగ్గురికి గాయాలు

హైదరాబాద్: నగరంలోని కోఠి బ్యాంక్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు డివైడర్‌ను ఢీకొంది.. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటన్నారు. కాగా కారులో మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *