Tuesday, 3 November 2026

మిస్‌ వరల్డ్‌ ఆస్ట్రేలియా ఫైనలిస్ట్‌ దుర్మరణం

636074180274274938మెల్‌బోర్న్‌: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచిన ఆస్ట్రేలియా సుందరి ఎలిసే మిల్లర్‌ కెనడీ (17) కారు ప్రమాదంలో దుర్మరణం పాలయింది. ఆగస్టు 7న మరీబా డింబుల్లా ప్రాంతంలో మిల్లర్‌ కారులో ప్రయాణిస్తుండగా.. ఒక ఫ్రెంచ్‌ పర్యాటకురాలు రాంగ్‌ రూట్లో వచ్చి తన కారుతో ఢీ కొట్టింది. దీంతో మిల్లర్‌కు తల, ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను హెలికాప్టర్‌లో సమీపంలోని కైర్న్స్‌ బేస్‌ హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఆమె 12న చికిత్స పొందుతూ మరణించింది. కాగా, కారు ప్రమాదానికి కారణమైన ఫ్రెంచ్‌ పర్యాటకురాలిని పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *