Tuesday, 3 November 2026

కోడుకుతో కలిసిభర్తను హత్య చేసిన భార్య

కాల్వ శ్రీరాంపూర్‌ : కుటుంబ తగాదాల నేపద్యంలో ఒక మహిశ కోడుకుతో కలిసి తన భర్తను హత్య చేసిన సంఘటన కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని మల్యాల గ్రామ పరిది జగ్గయ్యపల్లెలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం జగ్గయ్యపల్లె గ్రామానికి చెందిన. కామిడి సమ్మిరెడ్డి (48) అయన భార్య సరోజన, కోడుకు అరవింద్‌రెడ్డిలు కలిసి మంగళవారం రాత్రి బండరాయితో కోట్టి చంపారు. తెల్లవారే నరికి ఎవరీకి అనుమానం రాకుండా మృతుని భార్య సరోజన బుధవారం ఉదయం ఇంట్లో పనులు చేసుకుని తర్వాత ఏడ్వడం మొదలుపెట్టింది. గ్రామస్థులు వచ్చి చూసేసరికి సమ్మిరెడ్డి ఇంట్లో శవమై కనిపించాడు. భర్తను చంపిన బార్య సరోజన గ్రామస్థులకు అనుమానం రాకుండా మృతునిపై పరుగుల మందు పోసి ఉంచింది. మృతుని పక్కన ఉన్న రక్తపుమడుగును కడిగివేసింది. గ్రామస్థులకు అనుమానం వచ్చి సరోజనను వారిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఎస్సై జి.వి. కృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకోని వారిని విడిపించారు.పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మినారాయణ సుల్తానాబాద్‌ సీఐ కరుణాకర్‌ రావులు పంచనామా నిర్వహించి మృతుని భార్య సరోజన, కోడుకు అరవింద్‌ రెడ్డిని అదుపులోకి తీసుకోన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్‌రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *