Tuesday, 3 November 2026

కోతుల భారీ నుండి ప్రజలను కాపాడాలి – సీపీఐ నేతలు భూమయ్య, భాస్కర్ రెడ్డి

 

చేర్యాల (జనంసాక్షి) మే 29 : కోతుల భారీ నుండి చేర్యాల మండల ప్రజలను కాపాడాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ మండల నాయకులు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వారు జనంసాక్షితో మాట్లాడుతూ.. చేర్యాల పట్టణంతోపాటు గ్రామాల్లో కోతులు విచ్చలవిడిగా జనవాసాల్లో తిరుగుతూ ఇంటి పై కప్పులు ధ్వంసం చేయడంతో పాటు ఇండ్లల్లోకి చొరబడి ప్రజలపై దాడులు చేస్తున్నాయని, కోతుల దాడిలో అనేకమందికి తీవ్ర గాయాలలై ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేనులను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి కోతులను పట్టుకోవాలని కోరారు.