మునిపల్లి, మే 29, జనంసాక్షి : మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మా రెడ్డి మాతృముర్తి గత మూడురోజులక్రితం అనారోగ్యం తో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సోమవారం నాడు స్వయంగా తాటిపల్లికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపార. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, సీనియర్ నాయకులు శివచంద్రకుమార్ పాటిల్, భాస్కర్ తదితరులు ఉన్నారు.




