Monday, 2 November 2026

కోమటిరెడ్డి ఖబర్దార్కోమటిరెడ్డి ఖబర్దార్ మంత్రి జగదీష్ రెడ్డి పై నిందలు వేస్తే నాలుక చీరతా నల్గొండ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా ఎంపీ కోమటిరెడ్డి ని సవాల్ చేసిన ఎమ్మెల్యే కంచర్ల

 

 

 

 

 

నల్గొండ బ్యూరో,జనం సాక్షి. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పై అవాకులు చవాకులు   పేలితే  నాలుక చీరేస్తానంటూ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హెచ్చరించారు.  శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ  బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. శుక్రవారంకాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు నల్గొండ లో నిరుద్యోగ దీక్ష కు వచ్చారని అంతా ఒకటే అన్నారు,ముసలి ఎడ్లు వేరు వేరుగా వచ్చారు.ఔట్ డేట్ అయిన కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ప్రజలను యువతను మోసం చేసేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.మంత్రి జగదీష్ రెడ్డి   గురించి కాంగ్రెస్  అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదమని,  మంత్రి జగదీష్ రెడ్డి నిఖార్సయిన నిప్పులాంటి  మనిషి జగదీష్ రెడ్డి అని అన్నారు.కోమటిరెడ్డి చెవులో ముచ్చట్లు చెప్పి రాజశేఖర్ రెడ్డి ని సాగనంపిండ్రు గాని అభివృద్ధి చేయలేదన్నారు.పిల్లాయపల్లి, బ్రాహ్మన వెళ్ళేంల ప్రాజెక్టులు  ఏమయ్యాయో అందరికి తెలుసన్నారు.నల్గొండ అభివృద్ధికి రాజీనామా చేసి, ప్రాణ త్యాగం కు సిద్ధం గా ఉన్నానని నువ్వు సిద్ధమా కోమటిరెడ్డి అంటూ కంచర్ల ప్రశ్నించారు.నల్గొండ నడిబొడ్డులో కూర్చుందాం రా, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.మర్రి గూడ బై పాస్ లో వేయాల్సిన ప్లై ఓవర్ ను చర్ల పల్లి లో వేసి 32 మంది ప్రాణాలను బలిగొన్న నిచుడు కోమటిరెడ్డి అని,దుప్పల పల్లి  వద్ద ప్లై ఓవర్ వేసి 11మంది ప్రాణాలు తీసిన ఘనత కోమటిరెడ్డిదనిఅన్నారు. జిల్లా కేంద్రంలో ఐటి హబ్ ప్రారంభం కు సిద్ధమవుతుందని , ఎన్ జి కళాశాల నిర్మాణమవుతుందన్నారు.నల్గొండ మెడికల్ కళాశాల నిర్మాణం, బత్తాయి మార్కెట్, సమీకృత దుఖాన సుముదాయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.రోడ్ల విస్తరణ,అంబేద్కర్ విగ్రహం,కళా భారతి, ఉదయ సముద్రం అభివృద్ధి పథకాలు చూడాలని హితవు పలికారు కాంగ్రెస్ నాయకులు అందంగా ముస్తాబైన  నల్గొండ  జంక్షన్ లలో సెల్ఫీ లు దిగింది నిజం కాదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ లో గెలిచి నమ్మక ద్రోహం చేసిన కుటుంబం నిది   అని,తమ్ముడి కోసం పాల్వాయి స్రవంతి ని నాశనం చేసింది నువ్వు కాదా కోమటిరెడ్డి.మైనార్టీల ఓట్లు వేయించుకుని మోసం చేసాడని,బీసీ ల ఓట్ల తో గద్దె నెక్కి వాళ్ళని తొక్కింది నువ్వు కాదా,నల్గొండ లో నువ్వు పోటీ చేస్తే నిన్ను ఒడించేందుకు బిఆరెస్ క్యాడర్ సిద్ధంగా ఉంది.ఈ సారి డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఆన్ పార్లమెంట్ బాషను ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ గురించి  బీజేపీ చెడుగా మాట్లాడితే ఖండించిన ఘనత బిఆరెస్ అధినేత కే దక్కిందన్నారు.కోమటిరెడ్డి కి సవాల్ విసురుతున్న, నల్గొండ లో పోటీ చేయి. నిన్ను చిత్తుగా  ఒడించేందుకు సిద్ధంగా ఉన్న.కోమటిరెడ్డి లాంటి మోసకారి ని తన్ని  తరిమిస్తాం.కోమటిరెడ్డి   పచ్చి తాగుబోతు అని అన్నారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో  తెలంగాణ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉందని ఎక్కడో జరిగిన చిన్న లీకేజీ ని పట్టుకొని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు.దొర్లిన తప్పును ప్రభుత్వం మే గుర్తించి,  దిద్దుబాటు చర్యలు చేపట్టింది.నిన్న నల్లగొండ లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన భాష సరిగా లేదు.విజ్ఞత లేకుండా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్లు కూడా రావని జోష్యం పలికారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.