ఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 29 : నూతనంగా ఏర్పడిన ఎర్రవల్లి మండల కేంద్రంలో బట్లదిన్నె, వల్లూరు గ్రామాలను కూడా కలపాలని శనివారం హైదరాబాదులోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇటిక్యాల జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఎర్రవల్లి మండల కేంద్రంలో బట్లదిన్నె, వల్లూరు గ్రామాలను కూడా చేర్చాలని ప్రజల డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బట్లదిన్నే భాస్కర్, ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వర గౌడ్, తిక్కారెడ్డి, జనార్ధన్, మహేష్, భీముడు, వెంకటేష్, తదితరులు ఉన్నారు.




