Thursday, 5 November 2026

కోరిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

కోరిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

– సర్పంచి గాజుల శోభ
గ్రామం అభివృద్ధి కొరకే కాని పదవుల కొరకు కాదు

పెద్దవంగర డిసెంబర్ 08(జనం సాక్షి )గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకుల సహకారంతో కొరిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్‌ గాజుల శోభప్రసాద్ అన్నారు.గురువారం గ్రామాభివృద్ధిపై ఆమె విలేకరులతో మాట్లాడారు. 2018 నుండి సర్పంచ్‌గా గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహాయ సహకారంతో మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. 2018 నుండి 2022 వరకు సర్పంచ్‌గా పలు అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల 2023లో జరిగే సర్పంచ్‌ ఎన్నికలలో అభివృద్ధి పనులే సర్పంచ్‌గా గెలిపిస్తాయన్నారు.
నిస్వార్ధ పూరితంగా గ్రామాన్ని అభివృద్ధి జీవిత లక్ష్యంగా పని చేస్తామన్నారు.పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేశామన్నారు . గ్రామంలో వసతుల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేశామన్నారు. మౌలిక వసతులైన సీసీి రోడ్లు, విద్యుత్‌, వైద్య, విద్యకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. హరిత హారంలో నాటి