Wednesday, 4 November 2026

కోరుట్ల నియోజకవర్గ యువతకు ఐటి ఉద్యోగాల అవకాశం

 

 

 

 

 

 

మెట్పల్లి టౌన్ మే09, జనంసాక్షి : కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మరియు మెట్పల్లి కోరుట్ల పట్టణాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఐటి ఉద్యోగ సదవకాశం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఐటి రిక్రూట్మెంట్ ఉద్యోగాలు నిర్వహిస్తున్నామని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ మంగళవారం మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వివి ఫై ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీ కోరుట్ల పట్టణంలో త్వరలో ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ నెల 16వ తేదీన కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు అలాగే మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు అర్హత సాధించిన నిరుద్యోగ యువతీ యువకులకు కంపెనీ అపాయింట్మెంట్ లెటర్లు కూడా అందజేస్తుందని పేర్కొన్నారు ఐటి కంపెనీలో డిగ్రీ చదివిన యువతీ యువకుల కోసం కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ఇంజనీరింగ్ మరియు ఎంసీఏ చేసిన నిరుద్యోగ యువతీ యువకుల కోసం డాట్ నెట్ డెవలపర్స్, అలాగే డేటా అనాల్సిస్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ఇంటర్వ్యూలో ఎటువంటి రాజకీయ పైరవీలు ఉండవన్నారు మెరిట్ తో నైపుణ్యం గల యువతకే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, మెట్పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు నల్ల తిరుపతిరెడ్డి, ఎలాల దశఆరత్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు