నిర్మల్ జిల్లా బైంసాలో లోకసభ ప్రవాస్ యోజన లో భాగంగా బైంసా పట్టణంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల్ పర్యటించారు. 7వ వార్డులో ఓ పంక్షన్ హాల్ లో నిర్వహించిన సభలో ప్రోటోకాల్ వివాదం తెరపైకి బీజేపీ కౌన్సిలర్ తెచ్చారు. తలెత్తిన ఘటనపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డా. పడకంటి రమాదేవి సాటి మహిళను అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధ్యక్షురాలును డిమాండ్ చేశారు. బైంసాలో బీజేపీ పార్టీలో గ్రూప్ తగాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరుగా పార్టీలో కొనసాతోంది. కౌన్సిలర్ ఎవరికి మద్దతుగా నిలుస్తారని , పార్టీలో చర్చ నీయాంశంగా మారింది. బీజేపీ పార్టీకి కట్టుబడి ఉన్నానని , పార్టీ బలోపేతానికి తోడ్పాటు అందిస్తానని కౌన్సిలర్ చెప్పారు..




