హైదరాబాద్: అలహాబాద్‌లోని ఒక న్యాయస్థానం ఆవరణలో న్యాయవాదిపై కాల్పులు జరిపిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది మహ్మద్ నబీని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాల్పుల ఘటనతో కోపోద్రిక్తులైన పలువురు స్థానిక న్యాయవాదులు పోలీసులపై, కోర్టు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. విధ్వంసానికి పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గాయపడిన న్యాయవాది చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు.




