Thursday, 5 November 2026

పాలనా సౌలభ్యం కోసమే కొత్త సెక్రటేరియట్

4q47an15అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన విజన్ ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ముందున్న బాధ్యతలను, ప్రభుత్వ పథకాలను సభ్యులకు వివరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త సెక్రటేరియట్ నిర్మించి తీరుతామన్నారు సీఎం కేసీఆర్. ఒక్కో విభాగం ఒక్కో చోట ఉండటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురైతున్నయన్నారు. అటు దేశవ్యాప్తంగా రాష్ట్రానికి గుర్తింపు వచ్చేలా తెలంగాణ కళాభారతిని నిర్మిస్తామన్నారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టు కోసం ఎంతైన ఖర్చు పెట్టేందుకు వెనకడమని సీఎం కేసీఆర్ సభలో స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ రాజీలేదన్న సీఎం.. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయంపై త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు.

వచ్చే మార్చి తర్వాత తెలంగాణలో కరెంటు కోతలుండవన్నారు సీఎం కేసీఆర్. రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట విద్యుత్ ఇస్తామన్నారు. ఈ సారి కూడా కోతలు లేకుండా కరెంటు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అటు చంద్రబాబు కరెంటు కుట్రలను అసెంబ్లీ సాక్షిగా సీఎం ఎండగట్టారు.ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని మరోమారు సీఎం కేసీఆర్ ఢంకా బజాయించి చెప్పారు. సీఎం.. స్పీచ్ తో ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *