Tuesday, 24 November 2026

కోస్తా,తెలంగాణలకు వర్ష సూచన

విశాఖపట్నం:రాష్ట్రంలోని కోస్తా,తెలంగాణాల్లో మంగళవారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు,ఉరుములతో కూడిన జల్లులు,ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు.రాయలసీమలో ఒకట్రెండు చోట్ల మాత్రమే ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ,రాయలసీమల మీదుగా ఆల్పపీడన ద్రోణి చురుగ్గా కొనసాగుతోందన్నారు.ఆ ద్రోణికి ఆదివారం ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో సోమవారం ఉదయం వరకు పలుచోట్ల గణనీయమైన వర్షాలు కురిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *