విశాఖపట్టణం : ఆంధ్రాలోని కోస్తా, తెలంగాణలో రాగల 24 గంటల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని తెలిపింది. ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఆంధ్రాలోని కోస్తా, తెలంగాణలో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.




