ఈతకు వెళ్లి విద్యార్ధి మృతి

చిత్తూరు : ఈత సరదా ఓ విద్యార్ధి ప్రాణం తీసింది. జిల్లాలోని పలమనేరుకు చెందిన ఆరో తరగతి చదువుతున్న విద్యార్ధి మహేష్ ఆదివారం ఉదయం ఈత కొట్టేందుకు సమీపంలోగల చెరువుకు వెళ్లాడు. అయితే… అక్కడ ప్రమాదవశాత్తు నీళ్లల్లో మునిగి ఊపిరాడక ఆ విద్యార్ధి మృతిచెందాడు. దీంతో ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటివరకు తమ కళ్లెదుట గెంతుతూ సరదాగా ఉన్న బాలుడు విగతజీవిగా మారడంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది.

తాజావార్తలు