Wednesday, 4 November 2026

డెంగీతో ఓ బాలిక మృతిచెందింది

కర్నూలు : డెంగీతో ఓ బాలిక మృతిచెందింది. జిల్లాలోని బనగానపల్లె మండలం కాపులపల్లెలో లావణ్య అనే ఎనిమిదేళ్ల బాలిక ఆదివారం డెంగీతో బాధపడుతూ మృతిచెందింది. కాగా… వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా గత కొద్ది రోజులుగా జిల్లాలో పలువురు జ్వరాల బారినపడ్డారు. వీరిలో కొందరికి డెంగీగా నిర్ధారణ అయింది. అయినప్పటికీ వైద్యశాఖాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో విషజ్వరాలు కూడా ప్రబలుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికైనా వైద్యశాఖ విభాగం వారు వైద్యశిబిరాలను నిర్వహించి జ్వరాల నివారణకు కృషిచేయాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *