బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్13.(జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డివిఆర్ లను అధికార పార్టీ కౌన్సిలర్లు దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్రజల గోప్యత కు భంగం కలిగిస్తూ ప్రజలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు సెల్ఫోన్లో ఏర్పాటు చేసుకున్న యాప్ ద్వారా పరిశీలిస్తూ ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను కలిసిన వారినీ మీకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారని తక్షణమే కౌన్సిలర్ల ఇండ్లలో ఉన్న డివిఆర్ లను తొలగించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కొండ నరేష్, చొప్పదండి అంజన్న, ఉరవకొండ రాజు, కోడం శ్రీనివాస్, గాజుల సదానందం తదితరులు పాల్గొన్నారు.




