.
మండలంలోని రైతులు రుణాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి….
సహకార సంఘం చైర్మన్ ధర్మారెడ్డి….
చిలప్ చెడ్/మర్చి/జనంసాక్షి :- మండలంలోని సోమక్కపేట సహకార సంఘం సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి సహకార సంఘం చైర్మన్ ధర్మారెడ్డి అధ్యక్షతన వహించి మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్నటువంటి రైతు సోదరులకు సహకార సంఘం తరఫున రైతులకు రుణాలు ఇచ్చేందుకు సహకార సంఘం ఎప్పటికీ తోడ్పడుతుందని తెలిపారు. సహకార సంఘం తరఫున మండలంలోని భూమి కలిగిన రైతులు అందరికీ రుణాలు అందజేస్తామని అన్నారు. ముఖ్యంగా లోన్ తీసుకున్న రైతులు రెన్యువల్ చేసుకోవాలని అలాగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లోన్లు అందుబాటులో ఉన్నాయని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే చైర్మన్ ధర్మారెడ్డి అమెరికా పర్యటన ఉండడంతో మూడు నెలల పాటు ఇన్చార్జి చైర్మన్గా వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నాను పాలకవర్గం తీర్మానం చేసినట్లు తెలిపారు ఈనెల 20న రామచంద్రారెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నట్లు చైర్మన్ ధర్మ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి,సహకార సంఘం సీఈవో పోచయ్య, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, అంబర్ సింగ్, గంగాధర్, సుభాష్, యాద గౌడ్, సిబ్బంది నరసింహులు,దత్తు ఉన్నారు.




