ఆందోల్, మే 29, జనంసాక్షి: జూన్ 2 నుంచి నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఈ మేరకు సోమవారం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని తాహసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇండ్లు లేని వారిని గుర్తించి ఇండ్ల పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.




