మల్కాజిగిరి.జనంసాక్షి.మే 29
చిన్నారులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.సోమవారం కాకతీయ నగర్ లో డింపుల్ ప్లే స్కూల్ ను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపల్ దివ్యరాజు మాట్లాడుతూ.ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులచే చిన్నారులకు తక్కువ ఫీజుతో చక్కని విద్యను అందిస్తున్నామని 25 సంవత్సరాలలో ఇది నాల్గవ బ్రాంచ్ అని తెలిపారు.ఈకార్యక్రమంలో మండల రాధాకృష్ణ యాదవ్,ప్లే స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి.




