Tuesday, 3 November 2026

జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

 

 

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 29 (జనంసాక్షి): జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలోహుజూర్ నగర్ హాస్పిటల్ లో నూకల రామకృష్ణ బి పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని విజయ్ శంకర్, చిన్న వీరయ్య జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించగా ట్రస్ట్ నిర్వాహకులు అయినా పినపారాళ్ళ వంశీ, పారా సాయి, శివశంకర్ లు తక్షణమే స్పందించి డోనార్స్ తో మాట్లాడి పంపిస్తామన్నారు. సోమవారం ట్రస్ట్: ఫౌండర్ పినపారాళ్ళ వంశీ స్పందించి మమ్మద్ ఫిరోజ్ తో మాట్లాడి కోదాడ బ్లడ్ బ్యాంక్ వద్దకు పంపించి బి పాజిటివ్ బ్లడ్ రక్తదానం చేపించడం జరిగింది. జనచైతన్య ట్రస్ట్ తరుపున రక్తదానం చేసిన మమ్మద్ ఫిరోజ్ ని ట్రస్ట్ సభ్యులు అభినందించడం జరిగింది. ఈ సందర్బంగా ట్రస్ట్: ఫౌండర్ పినపారాళ్ళ వంశీ మాట్లాడుతూ రక్తం అవసరం వున్నా ప్రతి ఒక్కరికి జన చైతన్య ట్రస్ట్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది అని తెలుపుతూ, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు.