హైదరాబాద్ : ‘రన్ ఫర్ జీసస్’ పేరుతో క్రిస్టియన్లు శనివారం ఉదయం ట్యాంక్‌బండ్‌పై ర్యాలీని నిర్వహించారు. గత మూడేళ్లుగా గుడ్ ఫైడే మరుసటి రోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరిస్ స్కూల్లో ప్రారంభమైన ఈ ర్యాలీని ఫాదర్ స్వర్ణాభర్నాడ్ ప్రారంభించారు.
గుడ్‌ఫైడే,ఈస్టర్‌ల విశిష్టతను తెలియజేసేందుకు నిర్వహించిన రన్ ఫర్ జీసస్ రాలీలో భారీగా క్రిస్టియన్లు పాల్గొన్నారు. సెయింట్ మేరీస్ స్కూల్లో ప్రారంభమైన ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లి ఎల్బీ స్టేడియం వద్ద ముగుస్తుంది.




