Thursday, 5 November 2026

క్రిస్టియన్ ఎమ్మెల్సీగా గోనె సాల్మన్ కు అవకాశం కల్పించాలి

జగిత్యాల, జనంసాక్షి : త్వరలో ఖాళీ అయ్యే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవికి బీ.ఆర్.ఎస్ మరియు సీనియర్ క్రైస్తవ నాయకులు, తెలంగాణ యూనైటెడ్ క్రిస్టియన్స్ అండ్ ఫాస్టర్స్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ సాల్మన్ రాజ్ కు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చి సముచితంగా గౌరవించాలని టి.యూ.సి.పీ.ఎ జగిత్యాల జిల్లా ఇంచార్జి బి.యోహాన్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పాస్టర్ తిమోతి జయరాజ్ ధర్మపురి నియోజకవర్గపు పాస్టర్స్ సుధాకర్, డి. జె. నెల్సన్, శ్రీనివాస్, శాంతి కుమార్, డి. సాలమన్ రాజ్, డేవిడ్, రాజు, సాగర్, నరేష్, అబ్రహం, సిస్టర్. రజిత యోనా మరియు క్రైస్తవ సంఘ నాయకులు శుక్రవారం ధర్మపురిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ తెలంగాణ రాష్ట్ర రాజధానిలో 125 అడుగుల భారీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ద్వారా చరిత్ర సృషించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతినియోజకవర్గంలోని క్రైస్తవ కమ్యూనిటీ ద్వారా ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న సాల్మన్ రాజు ను ఎమ్మెల్సీ పదవీకి నామినేట్ చేయాలని వారు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. టీ.యూ.సీ. పీ.ఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించనున్న సమావేశానికి సహకారం, అనుమతి అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.