క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, నవంబర్ 10, (జనంసాక్షి )
క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని నెం 2 మైదానంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్ -19 అంతర్ జిల్లా క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలను స్నేహ పూర్వకంగా భావించి విజయవంతం చేయాలన్నారు. క్రీడాకారులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, టీఆరెఎస్ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్, నాయకులు శ్రీధర్, గడ్డం భీమా గౌడ్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.