Thursday, 5 November 2026

క్రీడాల్లో తెలంగాణకు పేరు ప్రతిష్టలు తేవాలి :మంత్రి మల్లారెడ్డి

 

 

 

 

 

 

శామీర్ పేట్, జనంసాక్షి :ప్రతి క్రీడాకారుడు క్రీడాస్పూర్తితోనే ముందుకు సాగాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు.సోమవారం హకీంపేట్ లోని స్పోర్ట్స్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కప్‌ 2023 క్రీడాపోటీలను కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభిచారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. ఎంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించకపోవడంతో క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోయిందన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతసీఎం కేసీఆర్‌ క్రీడాకారులతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహం అందిస్తున్నారని ఆయనగుర్తు చేశారు. క్రీడాకారుల్లోని క్రీడానైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేలా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిభను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వడం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటమిలను స్పిరిట్‌గానే స్వీకరించాలని ఆయన సూచించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా క్రీడాకారులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని, వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్బంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పలు పోటీలను ఆయన లాంచనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శామీర్ పేట్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్,ఎంపీపి ఎల్లు భాయి బాబు,జడ్పీటీసీ అనిత,ఎంపీడీఓ వాణి,మజీద్ పూర్ సర్పంచ్ మోహన్ రెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,స్పోర్ట్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
15ఎస్పీటీ -1: సమావేశం లో మాట్లాడుతున్న మంత్రి