బెల్లంపల్లి, మే 15, (జనంసాక్షి )మహిళలు, ఆడపిల్లలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మహిళా సమాన్ సేవింగ్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఏఎస్పీ, బెల్లంపల్లి సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీరామరావు కోరారు. ఈ పథకానికి మైనర్ బాలికలు, 18 సంవత్సరాలకు పైబడిన వారు అర్హులు అని వివరించారు. ఈపథకంలో వడ్డీ రేటు 7.5 ఉంటుందని, ఈఖాతాను కనిష్టంగా 1000 రూపాయలు, గరిష్టంగా రెండు లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చాన్నారు. ఈఖాతా కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుందని వివరించారు. రెండు సంవత్సరాలలో జమైన మొత్తం నుంచి 40 శాతం వరకు పాక్షికంగా ఉప సంహారణ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. జిల్లాలోని ఆడపిల్లలు, మహిళలు ఈపథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.




