Tuesday, 3 November 2026

క్రీడా ప్రాంగణాల పనులు త్వరగా పూర్తి చేయాలి

క్రీడా ప్రాంగణాల పనులు త్వరగా పూర్తి చేయాలి
* జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి మధుసూదన్ రాజు

టేకులపల్లి,నవంబర్ 30( జనం సాక్షి ): క్రీడా ప్రాంగణాల పనులు, నర్సరీ పనుల పురోగతిపై పరిశీలించి త్వరగా పనులను పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి మధుసూదన్ రాజు ఆదేశించారు. బుధవారం టేకులపల్లి మండలం రోల్లపాడు, తొమ్మిదో మైలు తండా, బేతంపూడి, గోలియా తండా, టేకులపల్లి, ముత్యాలంపాడు క్రాస్ రోడ్, సులానగర్, చింతలంక, బిల్లుడు తండా, గ్రామపంచాయతీల నందు కల ఏర్పాటుచేసిన రోడ్డు ఇరువైపులా నాటిన మొక్కలను ఆకస్మికంగా పరిశీలించినారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని మొక్కల నిర్వహణ సరిగా చేయాలని ఆదేశించారు. తెలంగాణకు క్రీడా ప్రాంగణాల పనుల పురోగతి పై, నర్సరీ పనుల పురోగతిపై తెలుసుకుని సిబ్బందిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో లక్ష్మీ గణేష్ గాంధీ, ఏపీఓ కాలంగి శ్రీనివాస్,ఈసి తిరుపతయ్య, బిల్లుడుతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అజ్మీర గలక, కార్యదర్శులు కృష్ణకుమారి, మీనా కుమారి, శ్వేత, పవిత్ర, భవాని, రమాదేవి, కిరణ్, టిఏ లు ధనలక్ష్మి, భీముడు, స్వప్న, ఎఫ్ ఎ లు వీరభద్రం, సరిత, లకన్, వీరన్న లు పాల్గొన్నారు.