Tuesday, 3 November 2026

జిల్లా అకాడమిక్ టాస్క్ ఫోర్సు ఉత్తర్వులు నిలిపివేయాలి

జిల్లా అకాడమిక్ టాస్క్ ఫోర్సు ఉత్తర్వులు నిలిపివేయాలి
* టీఎస్ పి ఆర్ టి యు డిమాండ్

టేకులపల్లి,నవంబర్ 30( జనం సాక్షి ): జిల్లా అకాడమిక్ టాస్క్ ఫోర్స్ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని టేకులపల్లి మండల టిఎస్ పిఆర్టియు అధ్యక్ష,కార్యదర్శులు గుగులోతు మోతిలాల్, టి సర్కార్ డిమాండ్ చేశారు. తొలి మెట్టు అమలులో భాగంగా కాంప్లెక్స్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖ అధికారులు,జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నప్పటికీ అదనంగా మళ్ళీ జిల్లా అకాడమిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం సరైనది కాదని వారన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, మౌలిక వసతులు, అదనపు బోధన సిబ్బందిని నియమించకుండా తొలి మెట్టు ఎలా విజయవంతం అవుతుంది అని ప్రశ్నించారు.
విద్యా వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఎస్ జి టి ఉపాద్యాయుల మీద తీవ్ర ఒత్తిడి పెంచుతూ తీసుకునే అసంబద్ధ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని అన్నారు. బహుళ తరగతి,బహుళ విషయ బోధన,సాధ్యం కాని సమయ సారిని,బోధనేతర పనులు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం కాంప్లెక్స్ స్థాయి నుండి విద్యా శాఖ కార్యదర్శి వరకు పర్యవేక్షణ పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తు ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేయడం సరైంది కాదన్నారు .అదే కాకుండా మళ్ళీ జిల్లా అకడమిక్ టాస్క్ ఫోర్స్ అంటూ ఎస్ జి టి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరించడంను ఖండిస్తున్నామన్నారు. ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులను మాత్రమే ఇచ్చి అద్భుతమైన ఫలితాలను ఆశించడం భావ్యం కాదని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు కనీసం పాఠశాల గ్రాంట్ విడుదల చేయలేదని, ఇంకా క్షేత్రస్థాయిలో పుస్తకాలు కూడా 100% సరఫరా కాలేదని, మరోవైపు టి ఎల్ ఎం తయారు చేయాలని ఒత్తిడికి గురి చేస్తూ దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తామని స్పష్టత ఇవ్వలేద