కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 30 :–. జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో నివాసితులై ఉన్న ప్రజల కోసం తెలంగాణ క్రీడా మైదానం పేరుతో పెద్ద పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన బోర్డు ఎలా మాయమైందని స్థానిక బిజెపి నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రంగుల శంకర్ నేతమాట్ల 30 సంవత్సరాలుగా 6 వేల పైచిలుకు ఎకరాల్లో దాదాపు 3 లక్షల జనాభా నివసించే జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఇప్పటి వరకూ కనీసం ఒక పార్క్మరియు ఒక ఆటస్థలం లేకపోవడం అత్యంత దారుణమని అన్నారుతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక ఇక్కడి ప్రజల బ్రతుకులు బాగుపడతాయి అనుకుంటే ఇక్కడి అధికార టీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి కేవలం తమ సొంత ఆస్తులు కూడబెట్టే పనిలో పడ్డారని విమర్శించారు
30 సంవత్సరాలుగా ఎదురు చూసిన కల నెరవేరిందని జవహార్ నగర్ యువత ఎంతో సంబర పడ్డారు. కానీ జవహార్ నగర్ అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల అధికార పార్టీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఇక్కడి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు మరియు అధికార టీఆర్ఎస్ నాయకులు మరోసారి రుజువు చేశారని దుయ్యబట్టారుఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు మరియు కమిషనర్ ఈ ఆటస్థలం విషయంలో తామంతా బాధ్యత వహించి తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోని యెడల జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో జవహార్ నగర్ బిజెపి మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు కమల్, బేతి సునీల్ నేత, వేపుల సన్నీ, ఎల్లగౌని మహేష్ గౌడ్, మంచన శ్రావణ్ కుమార్ పటేల్, వీర్ల బుజ్జి, ముల్లపూడి శివ, మేగావత్ రాజు నాయక్, బత్తిని శ్రీనివాస్, ప్రశాంత్, ఇలయ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు




