Tuesday, 3 November 2026

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.

 జనం సాక్షి దుబ్బాక. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి పల్లి గ్రామంలో పరశురాములనే రైతు ఆత్మహత్య చేసుకున్నందుకు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం వైయస్సార్ తెలంగాణ పార్టీ అచ్చమాపల్లి గ్రామ అధ్యక్షుడు ఎల్లం ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యంగా ఉండి కుటుంబానికి అన్యాయం చేయవద్దని దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ మాదాటి విజయభాస్కర్ రెడ్డి దుబ్బాక రైతాంగాన్ని కోరారు ఎల్లం, పరశురాములు, కనకయ్య రెడ్డబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు