Wednesday, 4 November 2026

క్రేన్ వాహనం కింద పడి బాలుడి మృతి..

హైదరాబాద్ : అప్పటిదాక ఆ చిన్నారి ముద్దు ముద్దు మాటలు మాట్లాడాడు. ఒక్కసారిగా యమదూతలా వచ్చిన ఓ క్రేన్ ఆ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన వనస్థలిపురం పరిధిలోని బి.ఎన్.రెడ్డి గూడలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ చిన్నారిపై నుండి పోనిచ్చాడు. దీనితో ఆ బాలుడి శరీరం ఛిద్రమై అక్కడికక్కడనే మృతి చెందాడు. ఇదంతా చూసిన ఆ కన్నతల్లి రోదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటన చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనై మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను సముదాయించే ప్రయత్నం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *