హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రి పురాతన భవనాన్ని కూల్చివేయద్దంటూ అడ్వకేట్ ప్రభాకర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆస్పత్రి భవనం పురాతనదా లేదా అని తేల్చాలని ధర్మాసనం అదేశిస్తూ.. ఆరు వారాల్లోగా నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, వారి సూచన మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అప్పటి వరకు బిల్డింగ్‌ను కూల్చివేయవద్దని ఆదేశించింది.




