కేపీహెచ్‌బీ కాలనీ : ఈత కొట్టేందుకు క్వారీ గుంతలోకి దిగిన ఓ విద్యార్థి మునిగి మృతి చెందాడు. కొత్తగూడకు చెందిన వెంకట్‌రెడ్డి కొడుకు కిరణ్‌రెడ్డి (17) నిజాంపేట చౌరస్తాలోని పీఎంఎస్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్‌డేలో పాల్గొన్నాడు. తర్వాత సాయంత్రం తన స్నేహితులతో కలిసి నిజాంపేటలోని మైతాస్ ప్రాజెక్టు సమీపంలోని ఒక క్వారీ వద్దకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత కిరణ్‌రెడ్డి తనకు ఈత వస్తుందని చెప్పి క్వారీ గుంతలోని నీటిలోకి కోసం దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. మృతదేహా న్ని శనివారం వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




