Wednesday, 4 November 2026

చెరువులో దూకిన మహిళను రక్షించిన విద్యార్థి

దిల్‌సుఖ్‌నగర్‌ : ఆర్థిక ఇబ్బందులు తా ళలేక సరూర్‌నగర్‌ చెరువులో దూకి ఆత్మహ త్యకు చేసేందుకు య త్నించిన ఓ మహిళ ను బీటెక్‌ విద్యార్ది ర క్షించాడు. కొత్తపేటకు చెందిన చంద్రమ్మ (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం ఉదయం సరూర్‌నగర్‌ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న సరూర్‌నగర్‌ చౌడికి చెందిన బీటెక్‌ విద్యార్థి బొడ్డుపల్లి శ్రీకాంత్‌ (27) చెరువులోకి దూకి ఆమెను రక్షించాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను సరూర్‌నగర్‌ సీఐ లింగయ్య, ఎస్‌ఐ లు సైదులు, ప్రభాకర్‌, విజయ్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *