హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సభాపతి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో బాధితులను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బంధువులతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హమీ ఇచ్చారు.




