హైదరాబాద్(జనం సాక్షి): నిన్న సాయంత్రం సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. మరో 18 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమందిని గాంధీకి తరలించగా.. మరికొంతమందిని సికింద్రాబాద్‌లోని యశోదకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తులను మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి వాళ్లకు హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రభుత్వమే వైద్య ఖర్చులు మొత్తం భరిస్తుందని.. అత్యుత్తమ వైద్యంతో గాయపడిన వారికి చికిత్స అందించాలని మంత్రి డాక్టర్లను సూచించారు.
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు




