Tuesday, 3 November 2026

క్షమాపణ చెప్పిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్

క్షమాపణ చెప్పిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
ఖిలవరంగల్, జనంసాక్షి:-
చేనేత రంగాన్ని అవమానించేలా మునుగోడు నియోజకవర్గంలో మగ్గం పై కాలు పెట్టడంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నేతన్నలు గత కొద్దిరోజులుగా డిమాండ్ చేశారు. వరంగల్ ప్రాంతం తో పాటు రాష్ట్ర నలుమూలల చేనేత కార్మికులు ఆందోళన సైతం చెప్పటారు.ఎమ్మెల్యే నరేందర్ చేనేత పరికరాలు, మగ్గంపై కాళ్లు వేసి అవమానించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బేషరతగా క్షమాపణ చెప్పడం జరిగింది