Saturday, 7 November 2026

ఖమ్మం లో జరిగే బహిరంగ సభను తరలి వెళ్ళిన దేవరకొండ టీడీపీ నాయకులు

ఖమ్మం లో జరిగే బహిరంగ సభను తరలి వెళ్ళిన దేవరకొండ టీడీపీ నాయకులు
కొండమల్లేపల్లి డిసెంబర్ 21 జనం సాక్షి న్యూస్ :
బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ దేవరకొండ టీడీపీ నాయకులు ఖమ్మం బహిరంగ సభ కు తెలుగుదేశం ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్ళారు ఖమ్మం భారీ బహిరంగ సభను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణ లో పార్టీ ని బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో మరింత సమయం కేటాయిస్తానని గతంలో అభివృద్ధి అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ కే సాధ్యమని, బడుగు బలహీన, బీసీ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో నిధులు కేటాయించమని తెలిపారని తెలంగాణ లో రాబోయే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని తెలిపారు అభివృద్ధి చేయని నాయకులను నిలదీయాలని తెలిపారు పార్టీ అధికారం లో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు పాదాభివందనం తెలిపారని సందర్బంగా తెలుగుదేశం పార్టీ దేవరకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మారబోతున్న టిడిపి తెలంగాణ బలోపేతం అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో టిడిపి నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వాస్కుల కృష్ణయ్య టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ, రాజేష్, రమేష్ హరీష్ తదితులున్నారు