ఖాదర్ పేటలో ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలజనం సాక్షి,చెన్నారావుపేట
మండలంలోని ఖాదర్ పేట గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గురువారం గ్రామ సర్పంచ్ అనుముల కుమారస్వామి- రమ దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ సిద్దేశ్వర ఆలయ అర్చకుడు గణేష్ శాస్త్రి వేద మంత్రోచ్చార నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైబోపేతంగా నిర్వహించారు.చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్ధసాని సత్యనారాయణరెడ్డి, బిఆర్ఎస్ మండల నాయకులు బాల్నె వెంకన్న లు పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో పెంతల బుచ్చిరెడ్డి, అరిగెల మల్లయ్య, గూడ మల్లయ్య, కూస రాజ్ కుమార్, ఎరుకల ప్రశాంత్, సెంచు నరేష్, సింగిరెడ్డి రవి, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఖాదర్ పేటలో ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు




