ఖైదీ నెంబర్‌ 16656… ఎరవాడ జైల్లో సంజయ్‌దత్‌

పుణె, జనంసాక్షి: ఎరవాడ కేంద్ర కారాగారంలో మూడోసారి ప్రవేశించిన సంజయ్‌దత్‌కి అక్కడి అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయనను ఉంచిన మూడో నంబర్‌ బ్యారక్‌ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు తెలిపారు సంజయ్‌ దత్‌ ఈ జైలులో 42 నెలల సమయం గడపాల్సివుంటుంది. ఒక నెలరోజులు మాత్రం స్నేహితుడి ఇంటినుంచి ఆయనకు భోజనం అందుతుంది. గతంలో 2007 లో సంజయ్‌దత్‌ ఇదే జైలులో ఉన్నారు.