మెట్రో రైలు పనుల నేపథ్యంలో 3 నెలలు ఆంక్షలు
ఖైరతాబాద్ కూడలిలో మెట్రో రైల్ ఆబ్లిగేటరీ స్పాన్ పనుల నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిో ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర అదనపు కమిషనర్(ట్రాఫిో) జితేందర్ తెలిపారు. ఈ కూడలి మీదుగా పంజాగుట్ట, బంజారాహిల్స్, లక్డీకాపూల్‌కు రాకపోకలు సాగించే వాహన చోదకులు రద్దీ వేళల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.చి లక్డీకాపూల్- నిరంకారి- అయోధ్య మార్గం నుంచి బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట వైపు వెళ్లే వారు షాదన్ కళాశాల ఎదురుగా గల బస్టాప్ నుంచి ఎడమ వైపు దారిలో చింతల బస్తీ మీదుగా బంజారాహిల్స్ రోడ్డు నం.1- ఎన్‌ఎఫ్‌సీఎల్- పంజాగుట్ట క్రాస్‌రోడ్డు- అమీర్‌పేట వెళ్లాలి.
చి నెక్లెస్ రోటరీ, సచివాలయం నుంచి బంజారాహిల్స్, ఆనంద్‌నగర్ వైపు వచ్చే వాహన చోదకులు ఖైరతాబాద్ కూడలి మీదుగా రాజ్‌భవన్ రోడ్‌లోగల మెట్రో రెసిడెన్సీ- కేసీపీ- తాజ్‌కృష్ణ- బంజారాహిల్స్ వెళ్లాలి.చి నెక్లెస్ రోడ్డు, సచివాలయం నుంచి పంజాగుట్ట, అమీర్‌పేట వెళ్లేవారు ఖైరతాబాద్ కూడలి నుంచి రాజ్‌భవన్ మార్గంలో మోనప్ప(రాజీవ్ సర్కిల్)- పంజాగుట్ట క్రాస్‌రోడ్డు- అమీర్‌పేట వైపు వెళ్లాలి.చి ఆనంద్‌నగర్ కాలనీ నుంచి సచివాలయం వైపు వెళ్లే వారు వెంకటరమణ కాలనీ- అన్సర్ మంజిల్- కేసీపీ కూడలి- చీఫ్ ఇంజినీర్ కార్యాలయం వరకు వెళ్లి యూటర్న్ తీసుకొని రాజ్‌భవన్ పాఠశాల మార్గం- ఖైరతాబాద్ కూడలి- ఫ్లైఓవర్ పైనుంచి వెఏ్త్లచ్చు.చి ఆనంద్‌నగర్ కాలనీ నుంచి లక్డీకాపూల్, అసెంబ్లీ వైపు వెళ్లేందుకు వెంకటరమణ కాలనీ- బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి- మాసబ్ ట్యాంో మీదుగా ప్రత్యామ్నాయ మార్గం ఉంది.




