ఖైరతాబాద్: జేఏసీ పిలుపు మేరకు రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దసంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఖైరతాబాద్ కూడలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు రవికుమార్, మంచెర శ్రీనివాస్ మాట్లాడుతూ సీమాంధ్రకు తొత్తుగా మారిన గవర్నర్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 28 లోపు ప్రకటన రాకుంటే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 28 లోపు ప్రకటన రాకుంటే జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే భాద్యత వహించాలని హెచ్చరించారు.




