హైదరాబాద్: సమరదీక్షకు మద్దతుగా బయల్దేరిన తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. తెరాస విద్యార్ధి నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇందిరాపార్కుకు ర్యాలీగా బయల్దేరేందుకు తెరాస ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.




