ఖైరతాబాద్ : సెలవు దినం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం పోటెత్తారు. ఎటువైపు చూసినా భక్త జనం సందడి కనిపించింది. అర కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉండడంతో చాలా మంది దూరం నుండే దర్శించుకొని వెళ్లారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఒక్కరోజే దాదాపు రెండు లక్షలకు పైగా జనం వినాయకుడ్ని దర్శించుకున్నారని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారుఖైరతాబాద్ భారీ గణపతి వద్ద శతావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ఆదివారం మహా మంగళ హారతిని ఇచ్చారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు జరుగుతున్న ఈ హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రామలక్ష్మణ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు గణపతికి పూజలు నిర్వహించారుభక్తులు అధిక సంఖ్యలో ఖైరతాబాద్ గణపతి దర్శనానికి రావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్‌భవన్ మార్గం, పంజాగుట్ట అమీర్‌పేట్‌ల వరకు, మరో వైపు లిబర్టీ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.




